Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 12:01 am Posted by : VARTHA SANDHYA DESK

నల్గొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ దాడి

  • నల్గొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ దాడి

నల్గొండ జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య):

నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ షేక్ మహ్మూద్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. రూ.10 వేల లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులు ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

ఫిర్యాదుదారుడి నుంచి పనికి సంబంధించి లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇన్‌స్పెక్టర్ షేక్ మహ్మూద్ రూ.10 వేల నగదును స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది.

ఏసీబీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా ఉద్యోగులు లంచం కోరితే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.