Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 5:44 pm Posted by : VARTHA SANDHYA DESK

దేవినేని అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపిన తిరువూరు వై.సి.పి. నాయకులు.

తిరువూరు ప్రతినిధి, మార్చి15 వార్త సంధ్య :

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని ఆయన కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తిరువూరు మున్సిపల్ కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, జడ్పిటిసి భీమిరెడ్డి లోకేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు శిరసాని ప్రకాష్, గుడిపూడి నారాయణరావు, ఎన్ కుటుంబరావు, చాట్ల బాబురావు, బండి రవి తదితరులు పాల్గొన్నారు.అలాగే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై దేవినేని అవినాష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకు దీర్ఘాయుష్షు, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు.