*దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ప్రతిష్ఠాత్మక “వైద్యరత్న నేషనల్ అవార్డు – 2026″* *”వైద్యో నారాయణో హరి” అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం – డాక్టర్ హేమరాజ్ సింగ్*

    దుబ్బాక ప్రతినిధి జూలై 23:(వార్త సంధ్య ) "వైద్యో నారాయణో హరి" అనే నానుడికి నిజమైన అర్థాన్ని ఆచరణలో చూపిస్తూ ప్రజలకు అంకితభావంతో వైద్య సేవలు అందిస్తున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ ప్రతిష్ఠాత్మక **"వైద్యరత్న నేషనల్ అవార్డు – 2026"**కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బహుజన సాహిత్య అకాడమీ (BSA) జాతీయ అవార్డు సెలెక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. వైద్య రంగంలో విశిష్ట సేవలు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి అందించిన విశేష...