తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం: తెలంగాణ హక్కుల సాధన సమితి
నిధులు, నియామకాలు, నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని ఖండించిన మేధావులు హైదరాబాద్, జూన్ 20 (వార్త) తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రజలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారులు కలిసి పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ హక్కుల సాధన సమితి నాయకులు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రైస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సీమర్ల విజేందర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, పశం యాదగిరి, ఎస్.ఎల్. పద్మ, డాక్టర్ ధర్మతేజ్, డాక్టర్ కృష్ణయ్య, కృష్ణుడు,...