టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, విధుల నిర్వహణ తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. అలాగే పెట్రోలింగ్ వాహనాలు, బ్లూ కోల్ట్స్...