చిన్నపాటి వర్షానికే రోడ్డు అస్తవ్యస్తం… జారిపడ్డ చిన్నారులు

చుంచుపల్లి, జూలై 27 (వార్త సంధ్య) : చిన్నపాటి వర్షం కురిసినా చాలు... చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలోని ప్రధాన రహదారి పూర్తిగా బురదమయంగా మారుతోంది. రోడ్డు అంతా గుంతలు, బురదతో నిండిపోవడంతో గ్రామస్తులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు జారిపడి కిందపడుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వర్షపు నీరు రోడ్డు మీద నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, నడిచే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్రామంలో కనీసం ప్రయాణానికి అనువైన రోడ్డు కూడా లేకపోవడం అధికారుల...