గ్రామ అభివృద్ధిలో సఫాయి కార్మికులే నిజమైన సైనికులు: సర్పంచ్, ఉప సర్పంచ్
సారంగాపూర్ మండలం (వార్త సంధ్య) – మార్చి 15 : స్థానిక పెంబట్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో సఫాయి కార్మికులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కార్మికులు చూపుతున్న చొరవను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కోలపాక రాధా-రాజు మాట్లాడుతూ, సఫాయి కార్మికులు చేసేది కేవలం పని మాత్రమే కాదని, అది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప సామాజిక సేవ అని కొనియాడారు. అందరూ నిద్రలేవకముందే గ్రామాన్ని శుభ్రం చేసే వారి...