గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం
మునుగోడు (వార్త సంధ్య) – మార్చి 15: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మునుగోడు మండలం చీకటి మామిడి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ సిబ్బందికి ఆదివారం గ్రామ సర్పంచ్ జీడిమడ్ల సైదులు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సైదులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పరిశుభ్రత నిర్వహణ మరియు ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి గ్రామపంచాయతీ సిబ్బందిని సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ అభివృద్ధిలో గ్రామపంచాయతీ సిబ్బంది...