గోధుమ వాగు బ్రిడ్జి మరమ్మతులకు ఎంపీకి వినతి
సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరిన కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ కొత్తగూడెం, జూన్ 06 (వార్త సంధ్య) : రామవరం – కొత్తగూడెం ను అనుసంధానించే జాతీయ రహదారి-30పై ఉన్న గోధుమ వాగు బ్రిడ్జి దుస్థితిని ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురామ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ తెలిపారు. చిన్నపాటి వర్షం కురిసినా బ్రిడ్జిపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలువురు ద్విచక్ర వాహనదారులు గుంతల కారణంగా కిందపడి గాయపడిన...