Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 7:49 pm Posted by : sairamkodipyaka7@gmail.com

కూతురు ఇంట్లో బాత్రూంలో వృద్ధుడు మృతి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

బ్రేకింగ్ న్యూస్

 

కూతురు ఇంట్లో బాత్రూంలో వృద్ధుడు మృతి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 16 (వార్త సంధ్య )

 

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన గద్దె నారాయణ (74), తండ్రి రాజయ్య, ఈరోజు ఉదయం తన కూతురు ఇంట్లో బాత్రూంకు వెళ్లిన సమయంలో మృతి చెందారు.

 

ఈ ఘటనపై అనుమానం ఉందని మృతుడి కోడలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

 

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.