కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేదల పొట్టకొడుతున్న కేంద్రం : కూనంనేని
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 10 (వార్త సంధ్య) : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ వారి జీవనాన్ని దుర్భరంగా మారుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇంధన, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్రం మరోసారి అదనపు భారాలు మోపడం దుర్మార్గమన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నీరుగార్చి పేదల బ్రతుకులను ఛిన్నాభిన్నం...