Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 2:53 pm Posted by : VARTHA SANDHYA DESK

కామారెడ్డి లో చోరీ.. ఇంట్లో 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల అపహరణ

బ్రేకింగ్ న్యూస్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 20  ( వార్తా సంధ్య)

 

కామారెడ్డిలో చోరీ.. ఇంట్లో 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాల అపహరణ

 

కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్‌లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి సుమారు మూడున్నర తులాల బంగారు గొలుసుతో పాటు 20 తులాల వెండి ఆభరణాలు దొంగలించారు.

 

బాధితుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రంజిత్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.