బ్రేకింగ్ న్యూస్
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 9: ( వార్త సంధ్య )
కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక తనిఖీలలో భారీగా ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి బి. హన్మంతరావు ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
సంబల్పూర్ నుండి నాందేడ్‌కు వెళ్తున్న నాగవలి ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 20809) లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా 10 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.
ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు మహారాష్ట్ర రాష్ట్రంలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్ మరియు ప్రవీణ్. వీరు ఒడిశా రాష్ట్రంలోని రాయగడ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, ఎస్ఐ విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, బలవంతరావు, ఫరూఖ్ మరియు సిబ్బంది రాజు, పవన్ రెడ్డి, బాబు, శరత్, వందన తదితరులు పాల్గొన్నారు.
అక్రమ మాదక ద్రవ్యాల రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం
జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోందని అధికారులు వెల్లడించారు.