Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 8:06 pm Posted by : VARTHA SANDHYA DESK

కామారెడ్డిలో మెగా జాబ్ మేళా విజయవంతం – ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు: డాక్టర్ పైడి ఎల్లారెడ్డి

 

కామారెడ్డిలో మెగా జాబ్ మేళా విజయవంతం – ఉద్యోగాలు సాధించిన యువతకు అభినందనలు: డాక్టర్ పైడి ఎల్లారెడ్డి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 19 ( వార్త సంధ్య )

కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి తెలిపారు. ఈ ఉపాధి కార్యక్రమంలో సుమారు 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషకరమని పేర్కొన్నారు.

 

జిల్లా నలుమూలల నుంచి దాదాపు 400 మంది నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాకు హాజరయ్యారని తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసి, ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి అభినందనలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉపాధి కల్పన కార్యక్రమాలను కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు.