Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 11:23 am Posted by : VARTHA SANDHYA DESK

కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

 

 

SIR ప్రక్రియపై కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

 

కామారెడ్డి: ప్రత్యేక ముమ్మర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా పనిచేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ పిలుపునిచ్చారు.

 

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మార్గదర్శకత్వంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

 

గంప ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు ఫారాలు అందజేస్తారని, అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) పర్యవేక్షించాలని కోరారు. ఇల్లు తాళం వేసి ఉంటే కనీసం మూడు సార్లు సందర్శించేలా చూడాలని సూచించారు.

 

ప్రతి ఓటరిని ప్రత్యక్షంగా కలిసి ఓటరు గుర్తింపు కార్డు వివరాలు, పేరు, ఫోటో తదితర సమాచారం సరిగా ఉందో లేదో పరిశీలించి, తప్పులు ఉంటే వెంటనే సరిచేయించాలని అన్నారు.

 

జూలై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటరు జాబితాను ప్రతి ఒక్కరూ పరిశీలించాలని, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్స్ దాఖలు చేసేందుకు ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని పిలుపునిచ్చారు.

 

గత ఎన్నికల్లో కొంతమంది అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయిన ఘటనలను ప్రస్తావిస్తూ, ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని గంప ప్రసాద్ అన్నారు.

 

ప్రజలు ఓటరు జాబితాకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే 1950 ఓటరు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.