కాంగ్రెస్లో చేరికలకు క్రమబద్ధమైన విధానం తప్పనిసరి: డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
కాంగ్రెస్లో చేరికలకు క్రమబద్ధమైన విధానం తప్పనిసరి: డిసిసి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో చేరికలు అధికారిక వేదికల ద్వారానే నిర్వహించాలని, అనధికారికంగా జరిగే చేరికలకు ఎలాంటి గుర్తింపు ఉండదని ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సభ్యత్వాలు, చేరికల ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించాలని మండల, టౌన్ అధ్యక్షులకు ఆయన సూచనలు జారీ చేశారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు లేదా ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే ముందుగా సంబంధిత మండల...