Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 13 July 2026, 2:08 pm Posted by : జడల నాగప్రసాద్

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న యువతకు అభినందనలు

భద్రాద్రి, జూలై 13 (వార్త సంధ్య) : ఆదివారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారమ్‌ల ప్రాముఖ్యతను వివరించి, ఫారమ్‌లను సక్రమంగా పూరించడంలో సహకరిస్తూ నమోదు ప్రక్రియను సులభతరం చేస్తున్న వాసుమల్ల గౌతం మరియు పోలంపల్లి సాయి తేజ గారిని స్థానికులు అభినందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో కీలకమని, అందుకోసం ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ ప్రభుత్వ సూచనల మేరకు అవసరమైన పత్రాలతో ముందుకు వచ్చి, ఎలాంటి సందేహాలున్నా వాలంటీర్లు, సంబంధిత సిబ్బందిని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.