ఎల్‌పీజీ సరఫరా పరిస్థితిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష
అదనపు కమర్షియల్ సిలిండర్ల కోసం కేంద్రానికి లేఖ హైదరాబాద్ సిటీ ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15:రాష్ట్రంలో ఎల్‌పీజీ సరఫరా స్థిరంగా ఉండేలా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కమర్షియల్ ఎల్‌పీజీ సరఫరాలో తీవ్ర కొరత నెలకొన్న నేపథ్యంలో అదనపు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లు అందించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. శనివారం సచివాలయంలో తెలంగాణ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ఎల్‌పీజీ సరఫరా...