ఉప సర్పంచుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్త పోరాటానికి సిద్ధం
హైదరాబాద్,ఇందిరాపార్క్ ధర్నా చౌక్, భవిష్యత్ ప్రజాపాలన ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడిన ఉప సర్పంచుల ఫోరం హైదరాబాద్, వార్త సంధ్య : గ్రామీణ పాలనలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప సర్పంచులను ప్రభుత్వం పూర్తిగా పక్కనపెట్టిందని తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ, అధికారాలు లేకుండా కేవలం పేరుకే పదవులు మిగిలిపోయేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉప సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు...