ఇల్లందు పురపాలక సర్వసభ్య సమావేశం

: ఇల్లందు పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడం, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పురపాలక చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక పరిధిలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే...