Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 11:47 pm Posted by : జడల నాగప్రసాద్

ఇల్లందు పురపాలక సర్వసభ్య సమావేశం

: ఇల్లందు పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించడం, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. పురపాలక చైర్మన్ దొడ్డా కిరణ్ మిత్ర డానియేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పురపాలక పరిధిలో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయాలని సూచించారు. సమావేశంలో కౌన్సిలర్లు తమ తమ వార్డుల్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను అధికారులు అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య అధికారులను ఆదేశించారు. పురపాలక అభివృద్ధి పనుల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో పురపాలక వైస్ చైర్మన్ పెండేల రాజు, కమిషనర్ సందీప్, కౌన్సిలర్లు సైదిమియా, అజ్మీర్ వంశీ, ఖుష్బూ మునావర్, చిల్లా విజయభారతి, రాధ కమల్ కోరి, గోపగాని రాజు, రేఖ స్వరూప్ రవిశంకర్, గందె పద్మ–సదానందం, మేరుగు కార్తీక్, రంప రమ్య, దండు సారయ్య, నీరుడు ఉపేంద్ర, సోని భాయ్ కోరి, పాబోలు స్వాతి, పింగళి అనూహ్య, మహ్మద్ జాఫర్, నీలపు రమేష్, కొర్లపాటి శివకిరణ్, చెనిగరపు శృతి, కో-ఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, పర్రె స్వర్ణలత, అజాం, హసీనా తదితరులు, అలాగే పురపాలక శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.