Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:40 pm Posted by : sairamkodipyaka7@gmail.com

ఆత్మహత్యకు వెళ్తున్న వ్యక్తిని 10 నిమిషాల్లో కాపాడిన కామారెడ్డి పోలీసులు

🚨 బ్రేకింగ్ న్యూస్

 

ఆత్మహత్యకు వెళ్తున్న వ్యక్తిని 10 నిమిషాల్లో కాపాడిన కామారెడ్డి పోలీసులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 20 ( వార్త సంధ్య )

కామారెడ్డిలో ఆత్మహత్యకు వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు సమయస్ఫూర్తితో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఇంట్లో చెప్పి వెళ్లిపోయిన వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు డయల్ 100కు సమాచారం అందించడంతో కానిస్టేబుల్ అరుణ్ నేతృత్వంలోని బృందం వెంటనే రంగంలోకి దిగింది. కేవలం 10 నిమిషాల్లోనే రైల్వే ట్రాక్ వద్ద అతడిని గుర్తించి సురక్షితంగా కాపాడింది.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, “సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదు. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. ప్రతి ప్రాణం అమూల్యమైనది” అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.