ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 21 ( వార్త సంధ్య ) ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా స్థానిక జయశంకర్ కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన అందించిన సైద్ధాంతిక బలం, ఉద్యమానికి ఇచ్చిన దిశానిర్దేశం చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ కాలనీ సంక్షేమ సంఘం...