Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 1:32 pm Posted by : sairamkodipyaka7@gmail.com

ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

  1. ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 21 ( వార్త సంధ్య )

ఆచార్య జయశంకర్ వర్ధంతి సందర్భంగా స్థానిక జయశంకర్ కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ చేసిన త్యాగాలు, సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ఆవిర్భావానికి ఆయన అందించిన సైద్ధాంతిక బలం, ఉద్యమానికి ఇచ్చిన దిశానిర్దేశం చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జయశంకర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిట్టిమల్ల అనంత రాములు, జూకంటి ప్రభాకర్ రెడ్డి, జగదీష్ యాదవ్, కుమ్మరి బాలయ్య, వెంకట రాములు, అవుసుల మురళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం ఆచార్య జయశంకర్ చేసిన కృషిని భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.