అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేతిరెడ్డి శకుంతల రెడ్డి బాధ్యతల స్వీకారం

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 08 (వార్త సంధ్య) : అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేతిరెడ్డి శకుంతల రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సేవాదళ్ ప్రతినిధులు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను స్వీకరించిన అనంతరం శకుంతల రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు మరియు సేవాదళ్ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి,...