Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 6:22 pm Posted by : sairamkodipyaka7@gmail.com

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞాక్స్ ప్రత్యేక యువత చైతన్య కార్యక్రమం

అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రజ్ఞాక్స్ ప్రత్యేక యువత చైతన్య కార్యక్రమం

 

హైదరాబాద్జూ   జూలై 29 :

పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ (PSSM) వ్యవస్థాపకులు పత్రిజీ స్ఫూర్తితో ప్రజ్ఞాక్స్ – యూత్ కాన్షియస్ ఎనర్జీ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యువత చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

ఈ కార్యక్రమం ఆగస్టు 8, 2026 (శనివారం) న ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు CESS ఆడిటోరియం, బేగంపేట్, హైదరాబాద్ లో జరగనుంది.

 

16 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ధ్యానం, యువత వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, ప్రేరణాత్మక ప్రసంగాలు, స్టేజ్ ప్రదర్శనలు, సంగీతం, నృత్యం, వినోదాత్మక కార్యక్రమాలు, గేమ్స్ మరియు చైతన్యాన్ని పెంపొందించే పలు అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

 

యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత మరియు సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత తమ అంతర్గత శక్తిని గుర్తించి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

 

కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, ఆసక్తి గల యువత ముందస్తుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

 

సంప్రదించవలసిన నంబర్

 

📞 73307 93860

 

“యువతలోని శక్తిని మేల్కొలిపి, ఉత్తమ భవిష్యత్తును నిర్మిద్దాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.